అసెంబ్లీ సమావేశాల గురించి కొత్త సభ్యుడైన తనతో సూచనలు చెప్పించుకోవడం కేసీఆర్‌కు సిగ్గుచేటు అని, సభ 30 రోజలపాటు నిర్వహించి ప్రతిపక్ష నేతలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ సంజయ్ గాంధీ దగ్గర శిష్యరకిం చేయలేదా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. అసెంబ్లీ సమావేశాల గురించి కేసీఆర్‌ను విమర్శిస్తూ తన వంటి కొత్త సభ్యుడితో సూచనలు చెప్పించుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నందున ఇవే చివరి సమావేశాలవుతాయని, కాబట్టి, రోజుకో అజెండాతో శాసన సభ 30 రోజులు నడపాలని తెలిపారు. సభలో ప్రతిపక్ష సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరం అని అన్నారు. బలం అంతా మీదే అంటున్నప్పుడు ఉన్న ముగ్గురికి సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరు? అంటూ ప్రశ్నించారు. నెల రోజులు సభ నడపడానికి అభ్యంతరం ఏమిటీ? బీఎస్సీ మీటింగ్‌కు కూడా తమను పిలవరని అన్నారు. తన వంటి కొత్త సభ్యుడితో చెప్పించుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.
అంతేకాదు, సమావేశాలు 30 రోజులపాటు నిర్వహించాలని బీజేపీ నుంచి తాము సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు నేరుగా లేఖ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల మీడియా ముఖం లేఖ రాస్తున్నామని చెప్పారు. కేంద్ర నిధుల మీద అఖిలపక్ష సమావేశం పెట్టాలని, చర్చించేందుకు తాము సిద్ధం అని స్పష్టం చేశారు.
Also Read: భారీవర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు పట్టించుకోలేదు: కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అని కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడని చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మరోసారి ఏపీ సీఎంల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని, ఈ సారి కూడా అదే పని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎవరి శిష్యుడు? సంజయ్ గాంధీ శిష్యుడు కాదా? అంటూ ప్రశ్నించారు. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరి వద్దనైనా శిష్యరికం చేయవచ్చునని అన్నారు. ఆంధ్ర సీఎం పేర్లతో కేసీఆర్ మరోసారి తన పబ్బం పడపడానికి చూస్తున్నారని విమర్శించారు.