యుద్ధమంటే.. ఫౌంహౌస్‌లో గ్లాసుల గలగలలు కాదు: రఘునందన్ పంచ్‌లు

By Siva KodatiFirst Published Nov 22, 2020, 4:51 PM IST
Highlights

ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆదివారం మీడియాతో మాట్లాడిన  ఆయన..కేసీఆర్‌కు ఏ గుడి ఇష్టమంటే అక్కడికి రావడానికి సిద్ధమన్నారు.

గుళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు, కేసీఆర్, కేటీఆర్‌లకు లేదని కరీంనగర్‌లో హిందువుల గురించి వ్యాఖ్యానించినందుకు అక్కడి ప్రజలు సమాధానం చెప్పారని రఘునందన్ రావు గుర్తుచేశారు.

సెక్యులర్ అనే పదానికి అర్థం తాను చెబుతానని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉండాలా.. మిగిలిన దేవాలయాలు, మసీదులు, చర్చిలు వాటి ఆదాయాలు, వాటి వనరులు ఎందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోకి రావడం లేదని ఆయన ప్రశ్నించారు.

మిగిలిన దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ఆదాయాలు, అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. ఇది సిరిసిల్ల కాదని.. హైదరాబాద్ అంటూ రఘునందన్ రావు చెప్పారు.

అభివృద్ధి అంటే కార్పోరేటర్లు కబ్జాలు చేయడమా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ అహ్మదాబాద్ వెళ్లి నరేంద్రమోడీ ఇంటింటికి ఇచ్చిన మంచినీటి పథకాన్ని స్టడీ చేశారని రఘునందన్ గుర్తుచేశారు.

భాగ్యనగరాన్ని నాశనం చేయడం కేటీఆర్‌కు తెలిసినంతగా చేయడం రాదన్నారు. అహ్మదాబాద్‌ను అభివృద్ధి చేశాం కాబట్టే.. కేటీఆర్ నాలుగేళ్ల క్రితం స్టడీ టూర్‌కు వెళ్లారని తెలిపారు.

138వ డివిజన్‌లో కార్పోరేటర్‌గా వున్న వ్యక్తి సుమారు 600 వంద గజాల్లో మూడంతస్తుల భవనం కట్టుకున్నారని.. ఆ బిల్డింగ్‌కు జీహెచ్ఎంసీ వేసిన ఇంటి పన్ను 101 రూపాయలు మాత్రమేనన్నారు.

భైంసాలో అరాచకం ఎవరిదని రఘునందన్ రావు ప్రశ్నించారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దేశంలో ఎన్ని చోట్ల మత ఘర్షణలు జరిగాయని ఆయన నిలదీశారు.

భైంసాలోని 40 హిందూ కుటుంబాల ఇళ్లను తగులబెడితే ఒక్క రోజైనా సందర్శించారనా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీజేపీ వస్తే మతం పేరుతో అల్లర్లు జరుగుతాయని అసత్య ప్రచారం చేస్తున్నాని రఘునందన్ మండిపడ్డారు.

18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వుందని.. వాటిలో ఎక్కడైనా మత ఘర్షణలు జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. అరాచకం అంటనే కల్వకుంట్ల కుటుంబమని రఘునందన్ ఎద్దేవా చేశారు.

యుద్ధమంటే బాటిళ్లు, గ్లాసులతో ఫామ్‌హౌస్‌లో గలగలలు చేసినట్లు కాదంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. సుమేధ చనిపోయిన రోజే నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ పదవికి రాజీనామా చేయాల్సిందని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. 

click me!