కరోనాపై అప్రమత్తంగా ఉండాలి:కేసీఆర్

Published : Nov 22, 2020, 04:10 PM IST
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి:కేసీఆర్

సారాంశం

 దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్:  దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

 సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని సిఎం సూచించారు.కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, మెడికల్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందన్నారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటుందని చెప్పారు. 

రికవరీ రేటు 94.5 శాతం ఉంటుందన్నారు. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.

ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయన్నారు.తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయని చెప్పారు. దీంతో పాటు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తుందన్నారు. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందని చెప్పారు. తప్పకుండా మాస్క్ ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు.
కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు సిఎం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu