బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ గృహనిర్భందం... ఇంటిచూట్టూ భారీగా పోలీసుల మొహరింపు

By Arun Kumar PFirst Published Oct 29, 2021, 10:32 AM IST
Highlights

సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి బిజెపి పిలుపునిచ్చిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహనిర్భందం చేసారు. 

హైదరాబాద్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులను బెదిరించేలా, కించపర్చేలా మాట్లాడాడని... అతడి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి బిజెపి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేసారు. హైదరాబాద్ గచ్చబౌలిలోని raghunandan rao ఇంటివద్ద భారీగా మొహరించిన పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.  

అయితే ఇప్పటికే dubbaka తో పాటు siddipet జిల్లావ్యాప్తంగా 300 పైగా BJP కార్యకర్తలను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. siddipet collectorate వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఎన్ని నిర్బంధాలున్నా ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ముట్టడి జరిగితీరుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేసారు.  

గురువారం సిద్దిపేటలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 24గంటల్లో రైతులకు ఆయన క్షమాపణ చెప్పకపోతే జిల్లా బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే కలెక్టర్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ 12గంటలకు కలెక్టరేట్ ముట్టడికి బిజెపి సిద్దమవగా పోలీసుల  ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు మొదలయ్యాయి. 

read more  ఎందుకు వరి వద్దంటున్నారు.. సాగు చేస్తే ఉరి వేస్తారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

సిద్దిపేట జిల్లాలో వరి సాగు వద్దంటూ రైతులను బెదిరించేలా సిద్దిపేట కలెక్టర్ మాట్లాడారని బిజెపి ఆరోపిస్తోంది. యాసంగి సాగుపై జరిగిన సమీక్షలో రాజ్యాంగబద్దమైన పదవిలో వున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి న్యాయవ్యవస్థను కించపర్చేలా మాట్లాడారని రఘునందన్ మండిపడ్డారు. ఇప్పటికే వెంకట్రామిరెడ్డిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర,  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డీవోపీటి సీనియర్ అధికారి అజయ్ భల్లా, తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజుకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ తెలిపారు. 

సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు  కలెక్టర్ గా వున్నానుకాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని వెంకట్రామిరెడ్డి  అనుకుంటున్నట్లుడని ఆరోపించారు. స్థానిక మంత్రి హరీష్ రావుకు అనుకూలంగా పనిచేస్తే చాలని అనుకోవడం సరికాదని హెచ్చరించారు. వరి సాగు చేయవద్దని కేంద్రం నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండిగానీ ఆదేశాలు అందాయా... ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా? అని దుబ్బాక ఎమ్మెల్యే నిలదీసారు. 

గత ఆరేళ్ళుగా సిద్దిపేట కలెక్టర్ గా కొనసాగుతున్న వెంకట్రామిరెడ్డి ఓవరాక్షన్ ఎక్కువయ్యిందని... ఆయనను వెంటనే బదిలీ చేయాలని రఘునందన్ డిమాండ్ చేసారు. న్యాయవ్యవస్థను కించపర్చేలా వున్న ఆయన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు స్పందించి సుమోటాగా కేసును విచారించాలని ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్ చేసారు. 

ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురువారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంజయ్మా ట్లాడుతూ.. వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని ప్రశ్నించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారని ఆయన గుర్తుచేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలని... ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని... ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

click me!