
హైదరాబాద్ రామాంతపూర్‌లో భాజపా ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ప్రభాకర్ నగరంలో ప్రదర్శన చేపట్టాలనుకున్నారు. అయితే.. ఆ ప్రదర్శన కారణంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు ఆయను నిర్బంధించారు.
ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేదని, విరమించుకోవాలని పోలీసులు సూచించారు. కొద్ది సేపటి తర్వాత అనుమతి లేనందున ర్యాలీ నిర్వహించడం లేదని ప్రభాకర్ ప్రకటించారు. స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ బహిష్కరణను వ్యతిరేకిస్తూ.. ఎమ్మెల్యే ప్రదర్శన చేపడదాం అనుకున్నారు.