గుళ్లకు వెళ్లి .. అమ్మతోడు, అయ్యతోడు అనడమేంటీ : రేవంత్ సవాల్‌పై ఈటల స్పందన

Siva Kodati |  
Published : Apr 22, 2023, 06:47 PM ISTUpdated : Apr 22, 2023, 06:50 PM IST
గుళ్లకు వెళ్లి .. అమ్మతోడు, అయ్యతోడు అనడమేంటీ : రేవంత్ సవాల్‌పై ఈటల స్పందన

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ డబ్బును ఎలా పంచుతున్నారనే తాను చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఆధారాలుంటే నేరుగా స్పందించాలి కానీ.. గుళ్లకు వెళ్లి అయ్యతోడు, అమ్మతోడు అనడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. తాను వ్యక్తులను కించపరిచే రకం కాదని రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ డబ్బును ఎలా పంచుతున్నారనే తాను చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రేవంత్ సవాల్ ఇతర అంశాలపై త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి స్పందిస్తానని ఈటల అన్నారు.

Also Read: అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి

నిన్న జరిగిన మీడియా సమావేశంలో తాను సింగరేణిపైనే మాట్లాడానని ఆయన గుర్తుచేశారు. విలేకర్లు అడిగిన ప్రశ్నల సందర్భంగానే ఈ విషయాన్ని ప్రస్తావించానని రాజేందర్ పేర్కొన్నారు. ఆత్మసాక్షిగానే తాను మాట్లాడానని.. ధర్మం కోసం , ప్రజల కోసమే తాను మాట్లాడినట్లు ఈటల స్పష్టం చేశారు.  నిజమెంటో అబద్ధం ఏంటో ప్రజలే తెలుస్తారని ఈటల అన్నారు. ఎంతమంతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా అని రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ తాటాకూ చప్పుళ్లకు భయపడే రకం కాదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే