ఆ వివరాలను దమ్ముంటే వెబ్‌సైట్‌లో పెట్టాలి.. కేసీఆర్‌కు ఎమ్మెల్యే ఈటల సవాలు..

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 4:35 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అబద్దాలు, తప్పుడు లెక్కలతో కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అబద్దాలు, తప్పుడు లెక్కలతో కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం మీద ఆధారపడి తెలంగాణ బతకడం లేదు.. కేంద్రమే తెలంగాణ మీద ఆధారపడి బతుకుతుందని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.  కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు వస్తుందని అన్నారు. ప్రజల డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. 

సీఎం కేసీఆర్ మంచి జరిగితే ఆయన ఖాతాలో.. చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని విమర్శించారు. బడ్జెట్‌ ఎక్కువ చూపించి కేంద్రం తక్కువ ఇస్తోందని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై హరీష్‌తో బహిరంగ చర్చకు సిద్దం అని సవాలు విసిరారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే అప్పులు, ఖర్చులు, కేటాయింపుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని సవాలు చేశారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను బీజేపీ వదిలిన బాణం అనే వాదనలో అర్థం ఉందా అని ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐలు టీఆర్ఎస్ వదిలిన బాణాలా? అని ప్రశ్నించారు. షర్మిలపై పోలీసులు వ్యవరించిన తీరు సరిగా లేదన్నారు. కేసీఆర్ పాలనలో అరాచకం జరుగుతుందని విమర్శించారు. పోలీసులు కూడా దుర్మార్గంగా వ్యవస్తున్నారని మండిపడ్డారు. 

click me!