తెలంగాణ ఎన్నికలు: రాహుల్‌ గాంధీపై బీజేపీ ఫిర్యాదు

sivanagaprasad kodati |  
Published : Dec 07, 2018, 08:54 AM IST
తెలంగాణ ఎన్నికలు: రాహుల్‌ గాంధీపై బీజేపీ ఫిర్యాదు

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని.. కొన్ని పత్రికలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని.. కొన్ని పత్రికలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది.

ఈ మేరకు గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌కు బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలను పెయిడ్ న్యూస్‌‌గా పరిగణించి, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంద్రసేనారెడ్డి చెప్పారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ ప్రారంభించిన తర్వాత సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. అప్పటికే చాలామంది క్యూలైన్లో వేచి ఉండటంతో ఒక్కొక్కరిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.  దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu