కేసీఆర్ పగటి కలలు కంటున్నారు: ప్రజలు టీఆర్‌ఎస్‌ పతనం కోసం ఎదురుచూస్తున్నారన్న తరుణ్‌ చుగ్

Published : Feb 23, 2022, 01:11 PM IST
కేసీఆర్ పగటి కలలు కంటున్నారు:  ప్రజలు టీఆర్‌ఎస్‌ పతనం కోసం ఎదురుచూస్తున్నారన్న తరుణ్‌ చుగ్

సారాంశం

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పతనం కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ (Tarun Chugh) అన్నారు. ప్రజల మద్దతు, బీజేపీ కార్యకర్తల బలంతో కేసీఆర్‌ను గద్దె దించుతామని చెప్పారు. బుధవారం తెలంగాణ బీజపీ నేతలు ఢిల్లీలో తరుణ్‌చుగ్‌తో సమావేశవయ్యారు. 

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పతనం కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ (Tarun Chugh) అన్నారు. ప్రజల మద్దతు, బీజేపీ కార్యకర్తల బలంతో కేసీఆర్‌ను గద్దె దించుతామని చెప్పారు. బుధవారం తెలంగాణ బీజపీ నేతలు ఢిల్లీలో తరుణ్‌చుగ్‌తో సమావేశవయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్.. తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్రమంగా బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే.. జైళ్లకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. బండి సంజయ్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 

బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ  భావప్రకటన స్వేచ్చను గౌరవిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని చెప్పారు. ఒక పేపర్, చానల్‌, ఇంగ్లీష్ పేపర్ పెట్టుకుని ఇతర పార్టీలకు వ్యతిరేకంగా కేసీఆర్ వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి మోదీ మాటాలను వక్రీకరించి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణలో బీజేపీ నాయకులపై ఇలాంటి ప్రచారమే చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ పార్టీలో నుంచి పంపే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 

ఇక, రాష్ట్రంలో బీజేపీపై TRS దాడులకు సంబంధించి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు  బీజేపీ బృందం ఫిర్యాదు చేయనుంది.  కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు ఫిర్యాదు చేసిన తర్వాత బీజేపీ అగ్రనేతలతో కూడా వారు భేటీ కానున్నారు.

బండి సంజయ్ నేతృత్వంలోని 20 మంది కాషాయ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ ఛుగ్ నివాసంలో తొలుత నేతలంతా సమావేశం కానున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు కౌంటర్ ప్లాన్ ను బీజేపీ రచించనుంది.  తమ పార్టీ కార్యకర్తలపై దాడులపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం