హైద్రాబాద్ లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకుంటుంది: బీజేపీ నేత లక్ష్మణ్

Published : Nov 27, 2020, 03:02 PM IST
హైద్రాబాద్ లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకుంటుంది: బీజేపీ నేత లక్ష్మణ్

సారాంశం

హైద్రాబాద్ లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకొంటుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.  


హైదరాబాద్: హైద్రాబాద్ లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకొంటుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.

శుక్రవారంనాడు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ అయ్యారు.  ఈ మేరకు గవర్నర్ కు టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వినతిపత్రం సమర్పించారు.

ఓటమి భయంతోనే శాంంతి భద్రతల సమస్యను టీఆర్ఎస్ ముందుకు తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను బూచిగా చూపి ఎన్నికలను వాయిదా వేయించాలని టీఆర్ఎస్ ప్లాన్ గా కన్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆయన కోరారు. 

అధికారులను కూడా టీఆర్ఎస్ ప్రచారానికి వాడుకొంటున్నారని ఆయన విమర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకొంటున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంటున్నాయి.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్