కరీంనగర్ బీజేపీకి షాక్... గంగుల సమక్షంలో టీఆర్ఎస్ గూటికి 100మంది నాయకులు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 12, 2021, 2:02 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికల కోసం బిజెపి నుండి భారీగా వలసలను ఆహ్వానించిన అధికార టీఆర్ఎస్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. జిల్లాలోని మండల, గ్రామ స్థాయి నాయకులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. 

కరీంనగర్: తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీని అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. మరీముఖ్యంగా హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో బిజెపి నుండి భారీ వలసలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే మండలస్థాయిలోనే కాదు గ్రామస్థాయి బిజెపి నాయకులకు కూడా స్వయంగా మంత్రులే గులాబీ కండువా కప్పుతున్నారు. ఇలా తాజాగా జిల్లా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పలువురు బిజెపి నాయకులు టీఆర్ఎస్ లో చేరారు.  

కొత్తపల్లి మండల ఉపాధ్యక్షులు పంజాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా బిజెపి ముఖ్య కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. మంత్రి గంగుల వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరినవారిలో దుంపటి అశోక్, సుంకే సుధాకర్, మందాటి అశోక, ఔదారి శేఖర్, దుంపాటి అంజయ్య, వెంగళ తిరుపతి, ప్రశాంత్, పంజల చిన్న రమేష్, కసిరెడ్డి వీరేశం తదితరులు వున్నారు.  

బీజేపీ ప్రజ వ్యతిరేక  విధానాలు నచ్చకే అధికార టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సదరు నాయకులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని... నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు వెల్లడించారు.

వీడియో

ఇదిలావుంటే హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట బిజెపిలో చేరిన నాయకులను సొంతగూటి చేర్చే బాధ్యతను మంత్రులు గంగులతో పాటు హరీష్ రావు తీసుకున్నారు. అలాగే నియోజకవర్గంలో మంచి పట్టున్న బిజెపి మండల, గ్రామ స్థాయి నాయకులను కూడా స్వయంగా మంత్రులే టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఇలా గతంలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంటకు చెందిన దాదాపు 100మంది యువకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీపీ సరిగొమ్ముల పావని-వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు యువకులు. 

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... హుజురాబాద్ లో అబివృద్ది పనులు జోరందుకున్నారు. ఈ అబివృద్దిని చూసే నియోజకవర్గంలోని యువత చూపు టీఆర్ఎస్ పై పడిందన్నారు. నియోజకవర్గం అభివృద్దిలో మేము సైతం భాగస్వాములం అవుతామంటూ గులాబీ బాట పడుతున్నారని మంత్రి గంగుల అన్నారు. 
 

click me!