Munugodu Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం బీజేపీ నేతల మధ్య పోటీ..

By Bukka SumabalaFirst Published Aug 18, 2022, 1:10 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలో పోటీ పెరిగిపోతోంది. ఉపఎన్నిక ఇంచార్జ్ అయితే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందనే ఆలోచనతో నేతలు కసరత్తులు చేస్తున్నారు. 

మునుగోడు : మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. మునుగోడు బీజేపీ ఉప ఎన్నిక ఇంచార్జ్ రేసులో నలుగురు లీడర్లు ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, మనోహర్ రెడ్డి ఇంచార్జ్ కోసం పోటీపడుతున్నారు. అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఉప ఎన్నికకు ఇంచార్జ్ ఉంటే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందని నేతల ఆలోచన. అమిత్ షా సభ తర్వాత నియోజకవర్గ ఇంచార్జ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్ లను ఈటెల రాజేందర్ బీజేపీలోకి తీసుకువచ్చారు. 

దుబ్బాక, హుజూరాబాద్ సెంటిమెంటుతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అటు దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు ఇంచార్జ్ గా జితేందర్ రెడ్డి పని చేయగా, గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్ రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డి ఉప ఎన్నిక ఇంచార్జ్ గా పెడితే బాగుంటుందని కమలనాథులు అంటున్నారు. అటు రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా, అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Munugode bypoll 2022 : బిజెపి దూకుడు... అమిత్ షా సభకు 18మంది ఇంచార్జీల నియామకం

ఇదిలా ఉండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలూ ఇక్కడ పాగా వేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ అదే స్థానం నుంచి .. బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం మునుగోడు తమ కంచుకోట అని ఈ సారి కూడా ఈ స్థానం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిగనున్నారు. సిఎం కేసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరుగనున్న ప్రజా దీవెన సభలో సిఎం కేసిఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రకటించనున్నారు. కాగా, మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీఅయ్యారు. గురువారం కేబినెట్ సమావేశం కంటే ముందు కొద్దిసేపు అక్కడి నేతలతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మళ్లీ కలుద్దామని నేతలతో చెప్పారు.  
 

click me!