కేసీఆర్ అలా అడిగే ఉంటారు.. : విజయశాంతి ఆసక్తికర ట్వీట్

Published : Oct 04, 2023, 02:01 AM IST
కేసీఆర్ అలా అడిగే ఉంటారు.. : విజయశాంతి ఆసక్తికర ట్వీట్

సారాంశం

సీఎం కేసీఆర్.. ఎన్డీఏలో చేరుతారని తనని కోరినట్లు కోరినట్లు ప్రధాని మోడీనే స్వయంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 

తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం కేసీఆర్.. ఎన్డీఏలో చేరుతారని తనని కోరినట్లు కోరినట్లు ప్రధాని మోడీనే స్వయంగా వెల్లడించారు. ప్రధాని వ్యాఖ్యలు నేడు చర్చనీయంగా మారాయి. అటు అధికార బిఆర్ఎస్ పార్టీ తోసిపుచ్చుతూ.. ఆ ప్రధాని అసత్య ప్రచారం చేసున్నారని మండిపడుతోంది. బీఆర్ ఎస్ కీలక నేతలు కూడా.. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 

బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "మోడీ గారు చెప్పినట్లుగా NDA ల చేరుతామని కేసీఆర్ గారు అడిగి ఉండవచ్చు. అది నిజమయ్యే ఉండి ఉంటుంది.  2009లో కూడా తెలంగాణాల మహాకూటమి పేర కమ్యూనిష్టులుతో కలిసి పోటీ చేసిన కేసీఆర్ .. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానా  NDA ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకమున్నది.కేటీఆర్ ఈ విషయంలో మోడీగారిని  తిట్టటం అవసరం లేదు. సమంజసం కాదు. " అని పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి