దళిత బంధు : తుపాకి రాముడు మాటలు, తుగ్లక్ వాగ్దానాలు.. కేసీఆర్ ను నమ్మడం ఒక్కటే.. విజయశాంతి..

By AN TeluguFirst Published Jul 22, 2021, 9:53 AM IST
Highlights

తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఇంకా కేసీఆర్ ను విశ్వసించడం అంటే తుపాకి రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే అని విజయశాంతి అన్నారు. 

హైదరాబాద్ : హుజురాబాద్ లో దళిత బంధు పథకం పై కేసీఆర్ మాటలు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయని బిజెపి నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బందు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజురాబాద్లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది అన్నారు.

అట్లానే.. గెలవలేని పార్టీలు హామీలు ఇవ్వగా లేనిది టిఆర్ఎస్ ఇస్తే తప్పేంటి అన్నారని..  హుజూర్నగర్, జిహెచ్ఎంసి, నాగార్జునసాగర్ ఎన్నికల హామీలు యాడపాయె…? అని ప్రశ్నించారు. 

తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఇంకా కేసీఆర్ ను విశ్వసించడం అంటే తుపాకి రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే అని విజయశాంతి అన్నారు. 

కాగా, దళిత బంధు పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. బుధవారం కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయంటూ మండిపడ్డారు. 

పది లక్షలతో ఒక కుటుంబం స్వయం సాధికారత సాధించవచ్చని కేసీఆర్ తెలిపారు. దళిత  బంధు పథకం చూసి కొందరికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతోందంటూ సీఎం సెటైర్లు వేశారు. దళిత బంధు పథకం ఆశామాషీ పథకం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఏ స్కీం పెట్టినా.. రాజకీయ ప్రయోజనం ఆశిస్తాం, టీఆర్ఎస్ కూడా పార్టీయే: దళిత బంధుపై కేసీఆర్ వ్యాఖ్యలు

నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టివుండని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు రూపకల్పనకు ఆరు నెలల తన తల పగలగొట్టుకున్నాని కేసీఆర్ వెల్లడించారు. పార్టీ అంటేనే పవర్ అన్న ఆయన.. దళిత బంధును హుజురాబాద్‌లోనే పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

తెలంగాణ పునర్నిర్మాణం ఆరంభమైందని.. తెలంగాణ బాగుండాలంటే యువత బాధ్యత  తీసుకోవాల్సిన అవసరం వుందని కేసీఆర్ సూచించారు. స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకోవడంలో తప్పేముందని సీఎం ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాజకీయ పార్టీనే కదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాకు స్వార్థం వుంటే దళిత బంధుని గజ్వేల్‌లోనే పెట్టేవాడినని స్పష్టం చేశారు.

click me!