
BRS members booked for allegedly attacking BJP leader’s house: భారతీయ జనతా పార్టీ నేత మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై దాడి చేసిన ఆరుగురు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యులపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. బీజేపీ నేత ఇంటిపై దాడి కేసులో టీఆర్ఎస్ సభ్యులపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులు బీజేపీ నేత ఇంటిపై దాడి చేసి బీజేపీ నేత సోదరుడిని గాయపరిచారనే పరోపణల క్రమంలో కేసు నమోదైంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులు బీజేపీ నేత ఇంటిపై దాడి చేశారు.
ఈ ఘటనలో మురళీకృష్ణ సోదరుడికి గాయాలయ్యాయని తాండూరు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిన మరో ఘటనలో టీఆర్ ఎస్ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ యువనేత తోట పవన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేతను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ యువనేత తోట పవన్ పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గూండాలు దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.