నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం మోమిన్ పూర్‌లో కలుషిత నీరు గ్రామంలో విషాదాన్ని నింపింది. కలుషిత నీరు తాగిన 17 ఏళ్ల అనిత మృతి చెందింది.
నారాయణపేట: జిల్లాలోని మద్దూరు మండలం మోమిన్ పూర్ లో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందగా, మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లాలోని మోమిన్ పేటలో కలుషిత నీరు తాగి 16 ఏళ్ల అనిత మృతి చెందింది. మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
కలుషిత నీరు తాగి మరణించిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు నమోదయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు.ఈ ఘటన 2011 డిసెంబర్ 15న జరిగింది. కలుషిత నీరు వల్లే ఇద్దరు మృతి చెందారని మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నారు.
గద్వాల జిల్లాలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు, డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్న సమయంలో తాగునీరు కలుషితమైనట్టుగా స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన 2022 మే 7వ తేదీన చోటు చేసుకుంది.హైద్రాబాద్ నగరంలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందారు . ఈ ఘటన 2022 ఏప్రిల్ 8న చోటు చేసుకుంది.