టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేకే ఆడబిడ్డలను బెదిరిస్తున్నారు : రాంమాధవ్

First Published Jul 6, 2018, 10:54 AM IST
Highlights

తెలంగాణ ఆడబిడ్డలపై బెదింరింపులకు దిగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారని అన్నారు. ఇందుకు బెల్లంపల్లి మున్సిపాలిటీ వ్యవవహారంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించిన తీరే నిదర్శనమని అన్నారు. ఓ కౌన్సిలర్‌ కూతురుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు బాగోలేదని, అతడి బెదిరింపులకు పాపం ఆ ఆడకూతురు భయపడుతూ మాట్లాడిన తీరు తనను ఎంతగానో కలచి వేసిందని అన్నారు.

బిజెపి జనచైతన్య యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలో జనిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాంమాధవ్ టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని స్వయంగా సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని అన్నారు. ప్రతి విషయంలోను సిరిసిల్ల మంత్రికి 3 శాతం పర్సంటేజి ఇవ్వాల్సింందేనని సిరిసిల్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. సిరిమల్ల మంత్రి ఎవరో మీకందరికి తెలుసు కదా అంటూ కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు.

ఇక రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయ ఆటలను సాగనివ్వబోమని రాంమాధవ్ స్పష్టం చేశారు. ఆయన డిల్లీలో ఒకనీతిని, హైదరహాద్ లో మరో నీతిని పాటిస్తున్నారని అన్నారు. డిల్లీకి వస్తే ప్రధానిని కలుస్తూ నాటకాలాడే కేసీఆర్, హైదరాబాద్ కు రాగానే మజ్లీస్ తో దోస్తీ చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, అదెప్పుడూ తమకు శత్రువేనని రాంమాధవ్ స్పష్టం చేశారు. 
   
click me!