రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేయాలి - కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ

Published : Feb 21, 2022, 10:31 PM IST
రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేయాలి - కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ

సారాంశం

హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం లేఖ రాశారు. 

రాజీవ్ రహదారిని స్టేట్ హైవే (State Highway) నుంచి నేషనల్ హైవే (national highway) గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (boinapalli vinod kumar) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయ‌న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (central minister vinod kumar)కి సోమ‌వారం లేఖ రాశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలను నేష‌న‌ల్ హైవేల‌తో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. 

రాజీవ్ రహదారి హైదరాబాద్ (hyderabad) నుంచి రామగుండం (ramagundam) వయా సిద్దిపేట (siddipet), కరీంనగర్ (karimnagar), పెద్దపల్లి (peddapalli) వ‌ర‌కు విస్త‌రించి ఉంద‌ని చెప్పారు. అయితే ఈ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలు పెరిగి రద్దీ పెరుగుతోంద‌ని అన్నారు. ర‌ద్దీ పెర‌గ‌డంతో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆ లేఖలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేస్తూ.. ప్ర‌స్తుతం ఉన్న ఈ రోడ్డును మహారాష్ట్ర (maharastra) లోని చంద్రపూర్ (chandrapur), నాగ్ పూర్ (nagpur) వరకు విస్త‌రించాల‌ని తాను కరీంనగర్ ఎంపీ (karimnager)గా 12-2-2019 నాడు పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని వినోద్ కుమార్ ఆ లేఖ‌లో గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 30 లో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా రహదారుల‌ కనెక్టివిటీని పెంచాలని వినోద్ కుమార్ ఆ లేఖలో చెప్పారు. రాష్ట్రానికి నేషనల్ హైవే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని తనతో పాటు ఇత‌ర టీఆర్ఎస్ ఎంపీలు అప్పటి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని గుర్తు చేశారు. ఆయ‌న త‌మ వినతికి సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారని చెప్పారు. అయితే ఇప్పటికీ అందులో ఏ ఒక్క దానిని కూడా అమలు చేయలేదని వినోద్ కుమార్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు ఇప్ప‌టి వ‌ర‌కు నేష‌నల్ హైవేతో కనెక్టివిటీ లేద‌ని గుర్తు చేశారు. అయితే రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేస్తే పెద్దపల్లి జిల్లాకు జాతీయ రహదారి కనెక్టివిటీ కలుగుతుందని తెలిపారు. దీంతో పెద్దపల్లి జిల్లాను కలుపుకుని 33 జిల్లాలకు జాతీయ రహదారి సౌకర్యం కలుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఈ అంశాల అన్నింటిపై కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సముచిత న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయ‌న పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu