నేను బిజెపికి వీడటానికి కారణాలవే..: బండి సంజయ్ కి రాసిన రాజీనామా లేఖలో మోత్కుపల్లి

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 12:36 PM IST
Highlights

బిజెపిని వీడటానికి గల కారణాలను వివరిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు రాజీనామా లేఖ రాశారు ఆ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు. 

హైదరాబాద్: తెలంగాణ బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు రాజీనామా లేఖను పంపించారు. 

బిజెపిని వీడటానికి గల కారణాలను తన రాజీనామా లేఖలో వివరించారు మోత్కుపల్లి. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా టిడిపిని వీడి బిజెపిలో చేరానని అన్నారు. కేవలం ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలనే బిజెపిలో చేరినట్లు మోత్కుపల్లి వెల్లడించారు. కానీ తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను ద్రుష్టిలో పెట్టుకుని అయినా బిజెపి సముచిత స్థానం కల్పించలేక పోయిందని... ఇది తనను ఎంతో బాధించిందన్నారు. 

మోత్కుపల్లి రాజీనామా లేఖ

''నా అనుభవాన్ని చూ  కేంద్ర చూసి కనీసం ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా బిజెపి అవకాశమివ్వలేదు. ఇలా పలుమార్లు నాకు అవకాశాలు కల్పించడంలో పార్టి విఫలం చెందింది. ఇది నన్ను ఎంతో వేధనకు గురిచేసింది'' అన్నారు. 

read more  తెలంగాణలో బిజెపికి షాక్: మోత్కుపల్లి రాజీనామా, కారుక్కేందుకు రెడీ?

''ఇక ఇటీవల సీఎం కేసీఆర్ దళిత సాధికారత సమావేశానికి నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశానికి తమరికి(బండి సంజయ్) చెప్పే నేను వెళ్లడం జరిగింది. అయినా పార్టీలో భిన్నాభిప్రాయిలు బహిర్గతం కావడం నన్ను బాధించింది'' అన్నారు. 

''ఎస్సీల భూములను ఆక్రమించిన ఈటల రాజేందర్ ను కనీసం వివరణ కోరకుండానే పార్టీలో చేర్చుకోవడం దారుణం. ఈ సమయంలో కనీసం ఒక్కమాటయినా నన్ను అడగకపోవడం ఇబ్బందికి గురిచేసింది. పార్టీ నన్ను, నా అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. అలాగే రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే నన్ను దూరంగా పెట్టడం బాధాకరంగా భావిస్తున్నా... అందుకోసమే పార్టీకి రాజీనామా చేస్తున్నాను'' అంటూ మోత్కుపల్లి బిజెపి అధ్యక్షుడు సంజయ్ కు రాజీనామా లేఖ రాశారు. 

click me!