పొలం పనులకు వెళ్లి... వాగులో చిక్కుకున్న 21మంది వ్యవసాయ కూలీలు (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 11:52 AM IST
Highlights

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇలా మహోగ్రంగా ప్రవహిస్తున్న ఓ వాగులో 21మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వకంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలా ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న వాగులో చిక్కుకున్న 21మంది వ్యవసాయ కూలీలను పోలీసులు, గ్రామస్తులు సురక్షితంగా కాపాడారు.  

కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. అయితే సాయంత్రం వారు తిరిగి గ్రామానికి వస్తూ వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కూలీలంతా వాగులో చిక్కుకోగా గ్రామస్తులు, పోలీసులు వారిని సురక్షితంగా కాపాడారు. 

వీడియో

ఇక పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ప్రవాహం పెరగడంతో నది ఒడ్డున ప్రాచీనమైన గౌతమేశ్వర స్వామి దేవాలయం కొందరు చిక్కుకున్నారు. ఆలయం చుట్టూ వరదనీరు చేరడంతో అర్చకుడి కుటుంబంతో పాటు కొంతమంది భక్తులు, జాలర్లు చిక్కుకున్నారు. 

read more  ఆశ్రమాన్ని చుట్టుముట్టిన గోదావరి... ఏడుగురు స్వాములను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ (వీడియో)

అర్చకుడితో సహా కుటుంబసభ్యులు 10 మంది, గురువారం రాత్రి దేవాలయంలో నిద్రకు వెళ్లిన 8మంది గోదావరి వరదలో చిక్కుకున్నారు. అలాగే చేపల వేటకు నదిలోకి వెళ్లిన కొందరు నీటిప్రవాహం పెరగడంతో దేవాలయం వద్దకు వెళ్లారు. ఇలా మొత్తం 28మంది గోదావరి వరదల్లో చిక్కుకున్నారు. 

గోదావరిలో చిక్కుకున్నవారు బిక్కుబిక్కుమంటూ  ప్రాణాలను అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాపాడేందుకు స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గోదావరిలో చిక్కుకున్నవారికి కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకురావాలని మంథని వాసులు కోరుతున్నారు. 
 

click me!