కేసీఆర్ పై షీటీమ్ కేసు పెట్టాలి: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published 20, Feb 2019, 2:36 PM IST
Highlights

గతంలోనూ మహిళలకు కేబినేట్ లో స్థానం కల్పించలేదని ఈసారైనా కల్పిస్తారని ఆశిస్తే ఈసారి కూడా అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలపై వివక్ష చూపుతున్నందుకు గానూ కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసు పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినేట్ ఏర్పాటుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ కేబినెట్‌లో మహిళలు, గిరిజనులకు ప్రాధాన్యం లేదని విమర్శించారు. 

గతంలోనూ మహిళలకు కేబినేట్ లో స్థానం కల్పించలేదని ఈసారైనా కల్పిస్తారని ఆశిస్తే ఈసారి కూడా అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలపై వివక్ష చూపుతున్నందుకు గానూ కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసు పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కిషన్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ కేబినేట్ లో మహిళల ప్రాతినిథ్యం లేకపోవడంపై మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు. మరోసారి జరగబోయే కేబినేట్ కూర్పులో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పుకుంటోంది. 

Last Updated 20, Feb 2019, 2:36 PM IST