మంత్రులకు నో చాయిస్...వారి ఎంపికబాధ్యత కూడా సీఎందే

By Arun Kumar PFirst Published Feb 20, 2019, 2:02 PM IST
Highlights

ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజైనా గడవకముందే నూతన మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. మంత్రులకు తమ వ్యక్తిగత సిబ్బందిని కూడా  నియమించుకునే వెసులుబాటు లేకుండా చేశారు సీఎం. మంత్రులు శాఖాపరమైన నిర్ణయాలు, సలహాలు తీసుకోవడానికి తమకు నచ్చిన అధికారులను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకునేవారు. అయితే తాజాగా మంత్రలకు ఆ అవకాశం ఇవ్వకుండా స్వయంగా ముఖ్యమంత్రే అమాత్యుల వ్యక్తిగత సిబ్బందిని నియమించనున్నారు.  

మంత్రులు తమకు కేటాయించిన శాఖల వ్యవహారాలను చూసుకోడానికి ఓ వ్యక్తిగత కార్యదర్శిని(పీఎస్) నియమించుకుంటారు.ఈ పీఎస్ లు మంత్రులకు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరిస్తూ పేషీలో కీలకంగా వ్యవహరిస్తారు. మంత్రుల పేషీలో ఏ ఫైలు ముందుకు కదలాలన్నా ఈ పీఎస్ చేతుల్లోనే వుంటుంది. 

అయితే ఇలా గతంలో మంత్రుల వద్ద పీఎస్ లుగా పనిచేసిన అధికారులు అవినీతికి పాల్పడినట్లు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఈ కారణంగానే కొంతమంది మంత్రులకు చెడ్డపేరు వచ్చినట్లు కేసీఆర్ గుర్తించారు. అందువల్ల ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూడాలని భావించారు. ఈ క్రమంలో విశేషాధికారాలు కలిగిన మంత్రుల పీఎస్ లను కూడా తానే నియమించాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. 

 ఈ ఎంపికను ఓ క్రమపద్దతిలో చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది అధికారుల జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయం  సిద్దం చేసినట్లు సమాచారం. వీరిలో ఏయే అధికారులను ఏ మంత్రుల  పీఎస్ గా నియమించాలో కేసీఆర్ నిర్ణయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.   

click me!
Last Updated Feb 20, 2019, 2:05 PM IST
click me!