ఆసుపత్రి నుండి మధులిక డిశ్చార్జి

Published : Feb 20, 2019, 02:16 PM ISTUpdated : Feb 20, 2019, 08:14 PM IST
ఆసుపత్రి నుండి మధులిక డిశ్చార్జి

సారాంశం

ఉన్మాది భరత్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మధులిక బుధవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయింది.


హైదరాబాద్: ఉన్మాది భరత్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మధులిక బుధవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయింది.

బుధవారం నాడు మధ్యాహ్నం యశోధ ఆసుపత్రి నుండి మధులిక డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. ఈ నెల 6వ తేదీన భరత్ మధులికపై దాడి చేశారు. మధులిక శరీరంపై సుమారు 15కు పైగా కత్తిగాట్లు ఉన్నాయి. యశోధ ఆసుపత్రిలోని నిపుణులైన వైద్యుల బృందం మధులికకు చికిత్స చేశారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మధులికను వైద్యులు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించి కాపాడారు. తాను ఆరోగ్యంగా  బయటపడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.ప్రేమించలేదనె నేపంతో  తనపై  భరత్ దాడికి పాల్పడ్డాడని మధులిక ఇదివరకే  జడ్జికి వాంగ్మూలం ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!