కేటీఆర్ మాటలు హాస్యాస్పదం.. కిషన్ రెడ్డి

Published : Mar 09, 2019, 02:05 PM IST
కేటీఆర్ మాటలు హాస్యాస్పదం.. కిషన్ రెడ్డి

సారాంశం

కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు.

కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలోని తమ పార్టీని తిట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేటీఆర్ లు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లుగా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన అన్నారు. అలాగే కేంద్రం ఇచ్చే నిధులను గ్రామాలకు మళ్లిస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌