వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం చంద్రబాబే: కేటీఆర్

By Siva KodatiFirst Published Mar 9, 2019, 1:57 PM IST
Highlights

మూడుసార్లు నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ చేజారిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల ప్రచార సన్నాహల్లో భాగంగా కేటీఆర్ ఇవాళ నాగర్‌కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 

ఒక పార్లమెంటు పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయన్నారు. 16 ఎంపీ స్థానాలు తొడగొట్టి సాధిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి కేసీఆర్, టీఆర్ఎస్‌పై చంద్రబాబు విషం కక్కుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

వ్యవసాయం దండగన్న ఏకైక ముఖ్యమంత్రి బాబేనని కేటీఆర్ గుర్తుచేశారు. మోడీ, చంద్రబాబులు కేసీఆర్ రైతు బంధును పేరు మార్చి అమలు చేస్తున్నారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంటు పరిధిలో 4,98,637 మంది రైతులకు రైతు బంధు సాయం అందిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

43 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయన్నారు. మే నుంచి ఆ మొత్తం రూ.2016 రూపాయలు పెరుగుతుందన్నారు. పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి మరింత మందికి కేసీఆర్ మేలు కలిగించారన్నారు.

పాలమూరు వెనుకబడే వుండాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ జిల్లాలో వలసలు ఆగాలని కేసీఆర్ ఎన్నో కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. 

click me!