కేసీఆర్‌‌ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Dec 7, 2018, 3:22 PM IST
Highlights

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో వున్న ఎన్నికల కోడ్ కు వ్యతిరేకంగా ఆపద్దర్మ ముఖ్యమంత్రి వ్యవహరించారంటూ భారతీయ జనతా పార్టీ నేత ఇంద్రసేనా రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటేసిన కేసీఆర్ మీడియాతో తాము గెలవబోతున్నట్లు ప్రకటించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని  ఈసిని కోరారు. 
 
ఇంతకు ముందే మంథని టీఈర్ఎస్ అభ్యర్థి పుట్టా మధుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా మధు, ఆయన భార్య పోలింగ్ బూత్ లోకి పార్టీ కండువాలు వేసుకుని వెళ్లినట్లు ఆరోపిస్తూ కేసు నమోదయ్యింది. 

అలాగే మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడగా ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. 

ఇవాళఈ ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల  కల్లా తెలంగాణలో 17 శాతం ఓట్లు పోలయ్యాయి.  అయితే మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం పుంజుకుని 49.15 శాతంగా నమోదయ్యింది. 
  
click me!