ఈటెల కుటుంబీకుల ఓట్ల గల్లంతు

Published : Dec 07, 2018, 03:16 PM IST
ఈటెల కుటుంబీకుల ఓట్ల గల్లంతు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబీకుల ఓట్లు గల్లంతయ్యాయి.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబీకుల ఓట్లు గల్లంతయ్యాయి.  ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాగా..  ఏకంగా మంత్రి ఈటెల రాజేందర్ తండ్రి, మరో ఇద్దరు కుటుంబసభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.ఇప్పటికే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఓట్లు కూడా గల్లంతవ్వడం గమనార్హం. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు.మద్యాహ్నం ఒంటిగంట సమయానికి 48శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం