బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు సోమవారం ఉదయం నుండి క్లాసులకు హాజరౌతున్నారు. ఆదివారం నాడు రాత్రి విద్యార్ధులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.దీంతో విద్యార్ధులు క్లాసులకు అటెండ్ అవుతున్నారు.
నిర్మల్: Basara iit విద్యార్ధులతో అధికారులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో సోమవారం నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరౌతున్నారు.
Mess Contractor ను మార్చాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు రాత్రి నుండి ఆదివారం నాడు రాత్రి 11 గంటల వరకు బాసర ట్రిపుల్ ఐటీ Students ఆందోళన సాగించారు. ఆదివారం నాడు రాత్రి విద్యార్ధులతో యూనివర్శిటీకి చెందిన అధికారులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో ఆదివారం నాడు రాత్రి తమ ఆందోళనను విరమించారు విద్యార్ధులు. ఆందోళనలను విరమించి విద్యార్ధులు తమ గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. ఆందోళన విరమించడంతో సోమవారం నాడు ఉదయం నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరౌతున్నారు.
undefined
ఆదివారం నాడు రాత్రి విద్యార్ధులు Vice Chancellor చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్ధులు కొందరు ఇంచార్జీ వీసీతో పాటు అధికారులతో చర్చించారు.ఈ చర్చలు పలప్రదం అయ్యాయి.ఈ విషయమై మిగిలిన విద్యార్ధులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల సమయంలో విద్యార్ధులు ఆందోళనను విరమించి తమ గదుల్లోకి వెళ్లి పడుకున్నారు.
ఈ ఏడాది జూలై 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి మరణించాడు. ఇదే జిల్లాకు చెందిన మరో విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. తాము విధించిన డెడ్ లైన్ ముగియడంతో విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి భోజనం మానేసి నిరసన చేపట్టారు. ఆదివారం నాడు ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా మానేశారు. అయితే కొందరు విద్యార్ధులు భోజనం చేశారని యూనివర్శిటీ ఫ్యాకల్టీ సిబ్బంది తెలిపారు.
also read:సబిత ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళన
ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా Hyderabad లో ఆందోళన నిర్వహించారు. ఆదివారం నాడు హైద్రాబాద్ ఎల్బీ నగర్ లో సమావేశమైన పేరేంట్స్ కమిటీ విద్యార్ధులకు మద్దతుగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఆదివారం నాడు సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బైఠాయించారు. ఆందోళన చేస్తున్న Parents ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్ధుల సమస్యలు పరిష్కరించేవరకు తాము కూడా విద్యార్ధులకు అండగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నామని పేరేంట్స్ కమిటీ తెలిపింది. మెస్ కాంట్రాక్టర్లను మార్చడానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని యూనివర్శీటీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు క్యాంపస్ నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. విద్యార్ధులతో జరిగిన చర్చలు విజయవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.