ప్రధాని ‘‘పీఠం’’ తర్వాత.. ముందు వీఆర్ఏల సంగతి చూడండి: కేసీఆర్‌పై ఈటల విమర్శలు

By Siva KodatiFirst Published Feb 22, 2022, 7:58 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై (kcr) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ ప్రధాని అవుతావా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని అవ్వడానికి ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

మంగళవారంనాడు హైదరాబాద్ (hyderabad) ఇందిరాపార్క్ (indira park) వద్ద వీఆర్ఏలు (vra) ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమకు వెంటనే పే స్కేలు జీవోను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బిజెపి (bjp) ఎమ్మెల్యే, మాజీ  మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) వారికి మద్ధతు తెలిపారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ పై (kcr) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రధాని అవుతావా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని అవ్వడానికి ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

వీఆర్ఏలు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయని, వీఆర్ఏలకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని వారికి పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో వీఆర్ఏల సమస్యలపై బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అని ఆయన చెప్పారు. వీఆర్ఏల పోరాటానికి బిజెపి అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారు.

Latest Videos

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రెవెన్యూ శాఖ కేసీఆర్ హయాంలో వెలవెలబోతుందని ఈటల రాజేందర్ ఆవేదన  వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధాలు కలిగిన రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కెసిఆర్ పాలనలో నిరుద్యోగులకే కాదు, ఉద్యోగాలలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ఎమ్మార్వోలపై పెట్రోల్ పోసిన చరిత్ర దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని ఈటల ధ్వజమెత్తారు. పోలీసులు కూడా ఉద్యోగులే అన్న విషయాన్ని కెసిఆర్ మర్చిపోవద్దని ఆయన గుర్తుచేశారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నందుకు విజయవాడ ‘‘చలో విజయవాడ’’తో భగ్గుమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల హెచ్చరించారు. వీఆర్వోలను తొలగించి రెండేళ్ళుగా ఇంట్లోనే కూర్చోబెట్టారని.. 2017లో శివరాత్రి రోజున వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై వీఆర్ఏలు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని ఈటల స్పష్టం చేశారు.

click me!