పార్టీ మార్పుపై బీజేపీ నేత డీకే అరుణ స్పష్టత.. ఆమె ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Oct 26, 2023, 2:49 PM IST

డీకే అరుణ పార్టీ మారబోతున్నారా? బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారుతారా? అంటూ కొన్ని మీడియా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ.. ఇలాంటి కథనాలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 


హైదరాబాద్: బీజేపీ నేత డీకే అరుణ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన బాటలోనే డీకే అరుణ, విజయశాంతి కూడా వెళ్లుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రచారంపై డీకే అరుణ స్పందించారు. ఆమె పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే పార్టీ మార్పు అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం తనను గుర్తించిందని, తనకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని పేర్కొన్నారు.

Latest Videos

Also Read: బండి సంజయ్ తొలగింపు అన్యాయం... బిఆర్ఎస్ కోసమే బలిచేసారు:సిపిఐ నారాయణ

కొన్ని మీడియా సంస్థలు విలువలు మరిచి తనపై దుష్ప్రచారానికి దిగాయని ఫైర్ అయ్యారు. కనీసం తన స్పందన కూడా అడగకుండా ఇలాంటి కథనాలు రాయడం హేయం అని మండిపడ్డారు. ఇలాగే తనపై దుష్ప్రచారం చేస్తే మాత్రం మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు.

click me!