బండి సంజయ్ తొలగింపు అన్యాయం... బిఆర్ఎస్ కోసమే బలిచేసారు:సిపిఐ నారాయణ 

By Arun Kumar P  |  First Published Oct 26, 2023, 2:08 PM IST

తెలంగాణలో బిఆర్ఎస్ గెలుపుకోసం బిజెపి సహకరిస్తోందని... అందులో భాగంగానే బండి సంజయ్ ను అధ్యక్ష పదవినుండి తొలగించారని సిపిఐ నారాయణ పేర్కొన్నారు.  


కరీంనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ  తెలంగాణ రాజకీయాలపై సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ నాయకుల కంటే బిజెపి పెద్దలకు బిఆర్ఎస్ నేతలే ఎక్కువైపోయారని అన్నారు. బిఆర్ఎస్ తో గట్టిగా కొట్లాడుతున్నాడనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తప్పించారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

బిఆర్ఎస్ పార్టీకి బిజెపి పరోక్షంగా సహకరిస్తోందని అనడానికి బండి సంజయ్ తొలగింపే నిదర్శనమని నారాయణ అన్నారు. అన్యాయంగా సంజయ్ ను అద్యక్ష పదవినుండి తప్పించారని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి లను ఓడించేందుకు పనిచేస్తామని నారాయణ పేర్కొన్నారు.  

Latest Videos

కరీంనగర్ పర్యాటక అభివృద్ది కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని చాడ వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు నారాయణ. ప్రకృతి అందాలను మరింత పెంచుతామని ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారని... కానీ నిజానికి కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందినవారే కాంట్రాక్ట్ దక్కించుకుని ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని నారాయణ ఆరోపించారు. 

హడావుడి గా కేబుల్ బ్రిడ్జ్ పనులు చేపట్టారని... దీని నాణ్యతపై అనేక అనుమానాలున్నాయని నారాయణ అన్నారు. దీని పరిస్థితి చూస్తుంటే రేపో మాపో కూలిపోయేలా వుందన్నారు. అందాల బ్రిడ్జ్ గా చెప్పుకునే ఇది ఇప్పుడు కలర్ ఎగిరిపోయి అందవిహీనంగా తయారయ్యిందన్నారు. పైన పటారం లోన లోటారం లాగా ఈ కేబుల్ బ్రిడ్జి కనిపిస్తోందని నారాయణ అన్నారు. 

తెలంగాణలో నిర్మించిన బ్రిడ్జ్ లు ఎలా కూలిపోతున్నాయో బిఆర్ఎస్ ‌ప్రభుత్వం కూలిపోతుందని నారాయణ అన్నారు. ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయని... మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కూలడం కలకలం రేపాయన్నారు. దీనిపై 
జ్యూడిషల్ ఎంక్వైరీ చేయాలని నారాయణ డిమాండ్ చేసారు. 

click me!