అనుచరుడితో బూట్లు తొడిగించుకొన్న బాబు మోహన్

Published : Oct 03, 2018, 01:34 PM IST
అనుచరుడితో బూట్లు తొడిగించుకొన్న  బాబు మోహన్

సారాంశం

మాజీ మంత్రి  బాబూమోహన్ తన అనుచరుడితో బూట్లు తొడిగించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్: మాజీ మంత్రి  బాబూమోహన్ తన అనుచరుడితో బూట్లు తొడిగించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తరచూ వివాదాస్పద కార్యక్రమాలతో  బాబు మోహన్  వార్తల్లో నిలుస్తున్నాడు.

 బీజేవైఎం ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో తేదీన నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో  మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు.  హైద్రాబాద్ ఘంటసాల పార్క్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొనే ముందు  తాను ధరించిన బూట్లను ఒక్క పక్కన విడిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక నుండి వచ్చిన బాబుమోహన్  తన బూట్ల కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ లోపుగా  ఓ వ్యక్తి వచ్చి బాబుమోహన్ బూట్లు అందించాడు. అంతేకాదు  బూట్లను ఆయనకు తొడిగాడు. ప్రస్తుతం  ఈ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ కార్యకర్తను తన్నేందుకు కాలు ఎత్తాడు బాబు మోహన్.  అయితే తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ జాబితాలో బాబుమోహన్ కు టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌