కేటీఆర్ మాట తప్పారు..టెక్కీల ఫైర్.. ‘‘నో రోడ్.. నో వోట్’’

By sivanagaprasad kodatiFirst Published Oct 3, 2018, 1:19 PM IST
Highlights

తమ ప్రాంతంలో ఉన్న రోడ్డును బాగుచేయాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో అమీన్‌పూర్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వినూతన్నంగా నిరసన తెలిపారు. 

తమ ప్రాంతంలో ఉన్న రోడ్డును బాగుచేయాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో అమీన్‌పూర్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వినూతన్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ప్రదర్శనగా అమీన్‌పూర్‌లో రోడ్డు మీదకు చేరుకుని ‘‘నో రోడ్.. నో వోట్’’ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఐటీ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు రావడంతో అమీనాపూర్ ప్రాంతం దశాబ్ధకాలంగా బాగా అభివృద్ధి చెందిందని.. వందలాది వెంచర్లు వెలిశాయని తెలిపారు. ఇక్కడ వందలాది మంది ఉద్యోగులు నివసిస్తున్నారని.. రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లడం నరకంగా ఉందన్నారు.

తమ కుటుంబసభ్యుడికి ఆరోగ్యం బాగోకపోతే.. కిలోమీటర్ దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రోడ్లు బాగోని కారణంగా 20 నిమిషాల సమయం పట్టిందని తెలిపాడు. దీనితో పాటుగా తరచూ రోడ్డు ప్రమాదాలు, వాహనాల మీద నుంచి జారి పడటంతో పాటు వెన్నెముకకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వారు తెలిపారు.

రోడ్ల దుస్థితితో పాటు తమ అవస్థలను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని.. దీనిపై స్పందించిన మంత్రి.. రోడ్లు బాగుచేయిస్తానని త్వరలో అమీన్‌పూర్‌ వస్తానని మాట ఇచ్చారన్నారు.

కానీ ఇంత వరకు ఆయన తమ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదని టెక్కీలు ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరిగి తాము విసిగిపోయామని... తమ ప్రాంతంలో రోడ్లు బాగు చేయిస్తేనే ఓట్లు వేస్తామని.. లేదంటే ఓట్లు అడగటానికి తమ ప్రాంతానికి రావొద్దని వారు స్పష్టం చేశారు.
 

click me!