BJP NEC in Hyderabad: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. తెలుగు రాష్ట్రాలు సహా కేరళ, తమిళనాడులోనూ అధికారం

Published : Jul 03, 2022, 06:05 PM IST
BJP NEC in Hyderabad: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. తెలుగు రాష్ట్రాలు సహా కేరళ, తమిళనాడులోనూ అధికారం

సారాంశం

బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ తన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.   

హైదరాబాద్: గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరేయగలిగింది. కానీ, దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆ పార్టీ వ్యూహాలు ఫలించలేవు. లోక్‌సభ ఎన్నికల్లోనూ దక్షిణాది నుంచి పెద్దగా సీట్లు దక్కలేవు. దక్షిణాదిలో కేరళ మినహాయిస్తే.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ పెద్దగా ఫలితాలను రాబట్టలేకపోయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతనో.. మరే ఇతర కారణాలతోనే ఇప్పుడు బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ కొంత బలహీనపడినా.. ఆ లోటును దక్షిణాది రాష్ట్రాల్లో తీర్చుకోవాలని బీజేపీ ఆలోచనలు చేసింది. అవే ఆలోచనలు అమలు చేయడం కూడా ప్రారంభించింది.

జయలలిత మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను బీజేపీ వాడుకుని తమిళనాడులో పాదం మోపాలని భావించింది. కానీ, నీట్ పరీక్ష, హిందీ భాషల వంటి అంశాల్లో తీవ్ర వ్యతిరేకతతో బీజేపీ అక్కడ అడుగు పెట్టలేకపోతున్నది. కానీ, తెలంగాణలో బీజేపీకి కొంత అనుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకోగలిగింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ తన పాదాన్ని సుస్థిరం చేసుకుంటున్నది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనలతో బీజేపీ ముందుకు వెళ్లుతున్నది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది.

ఈ సమావేశాల్లోనూ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో దక్షిణాది రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టినట్టు బీజేపీ స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కష్టసాధ్యమయ్యే రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలల్లో త్వరలోనే అధికారంలోకి వస్తామని వివరించింది.

ఈ రాజకీయ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెడుతూ వచ్చే 30 నుంచి 40 ఏళ్లు బీజేపీ శకం నడుస్తుందని పేర్కొన్నట్టు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఈ కాలంలోనే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని షా తెలిపినట్టు వివరించారు.

కుటుంబ పాలన సాగుతున్న తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తుందని అమిత్ షా వివరించారు. ఇటీవలి ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు.. తమ పార్టీకి ప్రజల నుంచి వచ్చిన ఆమోదంగా పేర్కొన్నారు. బీజేపీ అభివృద్ధి రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కుటుంబ పాలన, కులం, సంతుష్టివాదాలకు చరమగీతం పాడుతామని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్