యోగిని అనుసరిస్తాం... హైదరాబాద్‌తో పాటు వాటి పేర్లూ మారుస్తాం: రాజాసింగ్

By Arun Kumar PFirst Published Nov 9, 2018, 4:33 PM IST
Highlights

బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాము అధికారంలోకి వస్తే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగిని అనుసరిస్తామని ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే యూపిలోని  పలు నగరాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్ లో తాము అధికారంలోకి రాగానే ఇదేవిధంగా తెలంగాణలోని ఫలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చనున్నట్లు రాజాసింగ్ ప్రకటించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజాసింగ్ ప్రసంగిస్తూ యూపి సీఎం యోగి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. మొగల్స్, నిజాంలు తమ నిరంకుశ పాలనలో నగరాలు, పట్టణాల పేర్లను మార్చారని...వాటికి మళ్లీ పాతపేర్లు, త్యాగధనుల పేర్లను పెట్టడం మంచిపద్దతే అన్నారు.  అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను ఆయోధ్యగా పేర్లు మారుస్తూ యూపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజాసింగ్ సమర్దించారు. 

ఇక త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ద్వారా  బిజెపి అధికారంలోకి వస్తే ఇలాగే చేస్తామని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్, కరీంనగర్‌ల పేర్లను కూడా మార్చనున్నట్లు తెలిపారు. పురాతన కాలం నుండి ఉన్న భాగ్యనగరం అన్న పేరును కుతుబ్ షాహీల కాలంలో మార్చినట్లు...దీన్ని మళ్లీ మార్చాల్సిన అవసరం ఉందని రాజాసింగ్  అన్నారు.

మరిన్ని వార్తలు

నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది:పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు

టీఆర్ఎస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్, ఎందుకంటే?

కారణమిదే: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

click me!