బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ అధిష్టానం సీరియస్! బీఆర్ఎస్ సర్కారును ఎండగట్టండి..‘ప్రధాని పర్యటన విఫలం చేయడానికే’

By Mahesh K  |  First Published Apr 6, 2023, 4:29 AM IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు సెగలు హస్తినలో కనిపిస్తున్నాయి. కమలం పార్టీ.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంపై సమావేశాలు నిర్వహించింది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు భేటీ అయినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, ఆందోళనలు చేయండని, తాము అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వ హామీ వచ్చింది.


న్యూఢిల్లీ: పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలతోపాటు మరికొందరు నేతలు సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చ చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అరెస్టు గురించి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ సర్కారు తీరును ఎండగట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఆందోళనలు చేపట్టాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర నాయకత్వానికి అండగా అవసరమైతే కేంద్ర మంత్రులను పంపాలనే ఆలోచనలనూ పార్టీ అధిష్టానం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి నుంచే ఓ లీగల్ టీమ్‌ను ఇక్కడికి పంపాలనే ప్రస్తావన కూడా వచ్చింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత, న్యాయవాది రామచందర్‌రావులకు అమిత్ షా, జేపీ నడ్డాలు ఫోన్ చేసినట్టు సమాచారం.

Latest Videos

undefined

Also Read: బండి సంజయ్‌ను చట్ట ప్రకారమే అరెస్టు చేశారా? అధికారులు ఏమంటున్నారు?

బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, రోజంతా ఎక్కడ ఉంచారో తెలియదని అగ్రనేతలకు వీరు సమాధానం చెప్పినట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉన్నది. బండి సంజయ్‌ను అరెస్టు చేసి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను విఫలం చేయడానికి కుట్ర పన్నారని వివరించాయి.

ఢిల్లీలో అగ్ర నేతల భేటీ అనంతరం, రాష్ట్ర నేతలతో తరుణ్ ఛుగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇక్కడి నేతలతో మాట్లాడినట్టు సమాచారం. గురువారం నుంచి నిర్వహించాల్సిన ఆందోళనలపై మార్గనిర్దేశం చేసిశారని సమాచారం.

click me!