బండి సంజయ్‌ను చట్ట ప్రకారమే అరెస్టు చేశారా? అధికారులు ఏమంటున్నారు?

By Mahesh K  |  First Published Apr 6, 2023, 2:12 AM IST

బండి సంజయ్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందా? లేదా? అరెస్టు వారెంట్ కూడా చూపించకుండా అదుపులోకి తీసుకున్నారనే వాదనలు వస్తున్నాయి. ఇందుకు వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.


హైదరాబాద్: టెన్త్ కొశ్చన్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు రాష్ట్రంలో దుమారం రేపింది. ఎన్నికల సంవత్సరంలో.. అదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో ఆయన అరెస్టు చర్చనీయాంశమైంది. అధికార, విపక్షాలు పరస్పరం వేడి వేడి వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. పరీక్ష పత్రం లీక్ గంభీరమైన ఘటన, అది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించినదని అధికారపక్షం వాదిస్తున్నది. పేపర్ లీక్ ద్వారా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనేది బండి సంజయ్ కుట్ర అని ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండిస్తున్నది.

లీకైన పేపర్ ఆయనకు పంపినందుకు కేసులో సంజయ్‌ను ఏ1 నిందితుగా చేస్తారా? అని బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని ప్రభుత్వం ఇది అని విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌ను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ అడిగినా ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో? అందుకు సంబంధించిన అరెస్టు వారెంటు ఏదో కూడా పోలీసులు చూపించకుండానే అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

Latest Videos

నిజంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారా? అనే సందేహాలు వచ్చాయి. ఈ సంశయాల నేపథ్యంలోనే వరంగల్ సీపీ రంగనాథ్ అరెస్టు తర్వాతి రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.

చట్ట ప్రకారమే బండి సంజయ్ ను అరెస్టు చేశాం - మీడియా సమావేశంలో వరంగల్ సీపీ రంగనాథ్. pic.twitter.com/baYhywV8gt

— BRS Party (@BRSparty)

శాంతి భద్రతలకు విఘాతం కలుగకూడదనే ఉద్దేశంతో కరీంనగర్ పోలీసులు బండి సంజయ్‌ను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అలాగే, అరెస్టు వారెంట్ చూపించకుండా అదుపులోకి తీసుకున్నారనే వాదనలకూ సమాధానం ఇచ్చారు. వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 41 ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నదని వివరించారు.

లోక్‌సభా స్పీకర్‌కు సమాచారం

అలాగే, ఎంపీగా బండి సంజయ్‌కు ఉండే ప్రివిలేజెస్‌ను తుంగలో తొక్కారనే ఆరోపణలకూ ఆయన సమాధానం ఇచ్చారు. బండి సంజయ్ అరెస్టు గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమాచారం ఇచ్చామని సీపీ రంగనాథ్ వివరించారు. 

పార్లమెంటు సభ్యులు తమ విధుల నిర్వహణలో ఆటంకాలు కలుగరాదనే భావంతో వారికి కొన్ని ప్రివిలేజెస్‌ను ఇచ్చారు. ఉదాహరణకు కొన్ని సివిల్ కేసుల్లో అరెస్టు నుంచి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సెషన్ లేదా కమిటీ మీటింగ్ ప్రకటనకు 40 రోజుల ముందు.. లేదా అవి ముగిసిన తర్వత 40 రోజుల వరకు సివిల్ కేసుల్లో అరెస్టు చేయకుండా ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ, క్రిమినల్ కేసుల్లో ఈ ఉపశమనం ఉండదు.

click me!