లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. తెలంగాణలో పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

By Siva Kodati  |  First Published Jan 9, 2024, 8:33 PM IST

మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ నాయకత్వం సైతం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. 


మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తాజాగా బీజేపీ నాయకత్వం సైతం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. 

  • ఆదిలాబాద్‌ - అల్జాపూర్‌ శ్రీనివాస్‌
  • పెద్దపల్లి - వీరబెల్లి రఘునాథ్‌ రావు
  • కరీంనగర్‌ - పెద్దొళ్ల గంగా రెడ్డి
  • నిజామాబాద్‌ - వెంకట రమణి
  • జహీరాబాద్‌ - బద్దం మహిపాల్‌రెడ్డి
  • మెదక్‌ - మీసాల చంద్రయ్య
  • చేవెళ్ల - అంకాపురం విష్ణువర్ధన్‌రెడ్డి
  • మహబూబ్‌నగర్‌ - కేవీఎల్‌ఎన్‌ రెడ్డి(రాజు)
  • నాగర్‌ కర్నూల్‌ - ఎడ్ల అశోక్‌ రెడ్డి
  • మల్కాజ్‌గిరి - గోలి మధుసూదన్‌రెడ్డి
  • సికింద్రాబాద్‌ - వీరెల్లి చంద్రశేఖర్‌
  • హైదరాబాద్‌ - పాపారావు
  • వరంగల్‌ - డా.వి. మురళీధర్‌ గౌడ్‌
  • మహబూబాబాద్‌ - నూకల వెంకటనారాయణ రెడ్డి
  • నల్గొండ - చాడా శ్రీనివాస్‌రెడ్డి
  • భువనగిరి - ఎం. జయశ్రీ
  • ఖమ్మం - జె. శ్రీకాంత్‌
     
click me!