వామన్‌రావు హత్య: బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published Feb 25, 2021, 6:38 PM IST
Highlights

వామన్ రావు కేసులో  ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాయర్ వామన్‌రావు హత్యకు 4 నెలల క్రితమే బిట్టు శ్రీను ప్లాన్ చేశాడు. 

వామన్ రావు కేసులో  ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాయర్ వామన్‌రావు హత్యకు 4 నెలల క్రితమే బిట్టు శ్రీను ప్లాన్ చేశాడు.

వామన్ రావు బతికుంటే ఎప్పటికైనా సమస్యని కుంట శ్రీను, బిట్టు శ్రీనులు భావించారు. బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌పై కేసులు వేశాడు వామన్ రావు.

గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి వామన్ రావు హత్యకు రెక్కీ నిర్వహించింది శ్రీను గ్యాంగ్. అయితే వామన్ రావు చుట్టూ జనాలు ఎక్కువగా వుండటంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

17న వామన్ రావు ఒంటరిగా దొరకడంతో హత్యకు ప్లాన్ గీశారు. హత్య తర్వాత బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి వామన్ రావు దంపతులు చనిపోయారని కుంట శ్రీను చెప్పాడు. మర్డర్ తర్వాత కుంట శ్రీను గ్యాంగ్‌ను మహారాష్ట్ర వెళ్లాలని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు.

అయితే హత్య తర్వాత రెండ్రోజులు ఇంట్లోనే మకాం వేసింది గ్యాంగ్. హత్యకు ముందు వేరే సిమ్‌లు కొనుగోలు చేసింది. కాగా, ప్రధాన నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ  జరిపిన మంథని కోర్టు.. అందుకు అనుమతించింది. దీంతో వారం రోజుల పాటు వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

click me!