ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం:ఉత్తమ్ ముందే తన్నుకొన్న కాంగ్రెస్ నేతలు

By narsimha lode  |  First Published Feb 25, 2021, 5:16 PM IST

మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రెండు వర్గాల నేతలు బాహ బాహీకి దిగారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారించినా కూడ ఇద్దరు నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు.

మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రెండు వర్గాల నేతలు బాహ బాహీకి దిగారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారించినా కూడ ఇద్దరు నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  పార్టీలోని రెండు వర్గాల నేతలు బాహబాహీకి దిగారు.

Latest Videos

డాక్టర్ మురళీనాయక్, బలరామ్ నాయక్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నా నేతల మధ్య ఘర్షణ ఆగలేదు.

సమావేశానికి హాజరైన ముఖ్య నేతలు రెండు వర్గాలను వారించారు. అప్పుడు కానీ నేతలు తగ్గలేదు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ తో పాటు పలువురు ముఖ్యనాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకొంటున్నారు.

click me!