
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్ జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ప్రమాదంలో పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందివంతెనపై వాహనాలు వేగంగా వెళ్లకుండా నియం త్రించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేదని తెలుస్తుంది.
నవంబర్ మెుదటివారంలోనూ ఇదే ప్లై ఓవర్‌పై ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరూ వ్యక్తులు మృతి చెందారు. దానికి కారణం అతి వేగంమే. అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాతనైనా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, అధికారులు బాధ్యతరహిత్యంగా వ్వవహరించారు. అయితే తాజాగా పోలీసుల మరో నిర్వాకం మరోసారి బయట పడింది.
also read ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ప్రమాదానికి కారణమైన కల్వకుంట కృష్ణమీనన్ రావుకి పోలీసు ఫైన్ వేసారు . ఇతను empower labs and ar games సంస్థ ఫౌండర్ పని చేస్తున్నాడని తెలిపారు . ఖరీదైన కారు నడిపి ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు .అయితే ఇతను నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడింది .
also read బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ
కార్ లో ఉన్న ఎయిడ్ బాక్స్ ఓపెన్ కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . నడుపుతున్న కారు నెంబర్ ts09ew 5665 నెంబర్ ఆధారంగా అతడి వివరాలను పోలీసులు సేకరించారు .
అతడి లైఫ్ స్టైల్ పూర్తిగా మోడ్రన్‌గా ఉందని తెలుస్తోంది. ఇటివలే అతనికి ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. . అతని కారు వేగానికి సంబంధించిన వివరాలను పోలీసులు స్పీడ్ గన్ ద్వారా సేకరించారు . దీంతో కారుకు వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్లో పొందుపరిచారు .