ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి బైకర్‌పై ఇంజెక్షన్‌తో దాడి..

Published : Sep 19, 2022, 01:11 PM IST
ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి బైకర్‌పై ఇంజెక్షన్‌తో దాడి..

సారాంశం

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగిన దుండగుడు.. అతడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు మృతిచెందాడు. 

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగిన దుండగుడు.. అతడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు మృతిచెందాడు. వివరాలు.. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ బైక్‌పై వెళ్తుండగా వల్లభి సమీపంలోకి చేరుకోగానే.. ఓ దుండగుడు లిఫ్ట్ అడిగాడు.  దీంతో జమాల్ అతడికి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే కొంతదూరం వెళ్లాక జమాల్‌‌పై దుండగుడు ఇంజెక్షన్‌తో దాడి చేశాడు. దీనిని గుర్తించిన జమాల్‌ వెంటనే బైక్‌ను ఆపాడు. అయితే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ విషయాన్ని జమాల్ తన భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం స్పృహ కోల్పోయాడు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్నవారు 108 వాహనంలో  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జమాల్ మృతిచెందారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. జమాల్ మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు. ఇక, జమాల్‌పై దుండగుడు పాయిజన్ ఇంజక్షన్‌తో దాడి చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు