షాకింగ్.. భారీ వర్షానికి నీట్లో కొట్టుకుపోయిన బైకర్, అతను కాపాడకుంటే...

By SumaBala BukkaFirst Published Oct 13, 2022, 10:34 AM IST
Highlights

హైదరాబాద్ లో భారీ వర్షానికి ఓ టూ వీలర్ మీద వస్తున్న వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని గమనించిన స్థానికులు రక్షించడంతో బతికాడు. 

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఓ బైకర్ వరద నీటిలో కొట్టుకుపోయిన విషయం అక్కడి స్థానికులు తీసిన వీడియోలో రికార్డయ్యింది. అయితే అతడిని సకాలంలో గమనించిన స్థానిక వ్యక్తి రక్షించాడు. వరద నీటితో పొంగి పొర్లుతున్న వీధిలో నుంచి వెళ్ళడానికి అతను ప్రయత్నించాడు. దీంతో బండి అదుపుతప్పింది. ఆ వ్యక్తి బండిమీదినుంచి పడిపోయాడు. నీటి ప్రవాహానికి బండి కొట్టుకుపోయింది. ప్రవాహంలో అతను కూడా కొట్టుకుపోయేవాడే.. ఇంతలోనే అక్కడికి దగ్గర్లో ఉన్న మరో వ్యక్తి గమనించి అతడిని పక్కకు లాగడంతో బతికి బయటపడ్డాడు. 

ఈ ఘటన నగరంలోని బోరబండ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియోలో రోడ్లు నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షానికి చాలా దుకాణాల షట్టర్‌లు మూసేసి కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహానికి ఆటోలు కొట్టుకుపోతున్నాయి. పార్క్ చేసిన ఉన్న టూ వీలర్లు కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు స్తానికులు నానాతంటాలు పడ్డారు. ఒక కారు రోడ్లలో ఒకదానిని బ్లాక్ చేసింది, అది పార్క్ చేసిన ప్రాంతంనుంచి వరదనీటిలో కొట్టుకుపోయి వచ్చి అక్కడ స్టక్ అయి ఉండొచ్చు.హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. 

click me!