టీఆర్ఎస్ కి భారీ షాక్.. పార్టీకి 34మంది రాజీనామా

Published : Nov 26, 2018, 04:09 PM IST
టీఆర్ఎస్ కి భారీ షాక్.. పార్టీకి 34మంది రాజీనామా

సారాంశం

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. 34మంది పార్టీ నేతలు, కార్యకర్తలు.. టీఆర్ఎస్ కి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. 34మంది పార్టీ నేతలు, కార్యకర్తలు.. టీఆర్ఎస్ కి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి  చెందిన జడ్పీటీసీ,  తరుమలగిరి జడ్పీటీసీ పేరాల పూలమ్మ తదిరతరు  నాయకులు సోమవారం పార్టీని వీడారు.

తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వారు తమ రాజీనామా పత్రాలని, టీఆర్ఎస్ పార్టీ కండువాలను సమర్పించి.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాము పార్టీ కోసం కృషి చేస్తున్నామని.. అయినప్పటికీ తమకు కనీస విలువ కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమని కాదని.. ఇటీవల వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చిన వారికి ప్రాముఖ్యతను ఇస్తూ.. వారికి కీలక పదువులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంతోనే తామంతా ముకుమ్మడిగా రాజీనామాలు సమర్పించినట్లు వారు ప్రకటించారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్