ఎన్నికలు ముగిసే వరకే టీఆర్ఎస్ జెండా...ఆ తర్వాత...: ఈటల

By Arun Kumar PFirst Published Nov 26, 2018, 3:52 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో పదిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రముఖ రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రస్థాయి నాయకులు కూడా అత్యవసరమైతే తప్ప తమ నియోజకవర్గాన్ని వీడటం లేరు. తమ  సమయాన్నంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే కేటాయిస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా తన నియోజకవర్గం హుజురాబాద్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం తరపున తాను నియోజకవర్గంలోని ప్రజలకు ఏ విధంగా  మేలుచేశారో వివరిస్తూ...మళ్ళీ తనకే ఓటేయాలంటూ ప్రజలను మంత్రి కోరారు.

ఇవాళ ఈటల నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం వల్బాపూర్,నర్సింగపూర్, కొండపాక గ్రామాల్లో ప్రచార నిర్శహించారు. ఈ సందర్భగా ఈటల మాట్లాడుతూ...తాను కేవలం ఎన్నికల సమయంలోనే పార్టీ జెండాను మోస్తానన్నారు. ఆ తర్వాత ప్రజలందరిని కలుపుకుని పోతూ నియోజకకవర్గ అభివృద్దినే ఎజెండాగా మార్చుకుని పనిచేస్తానని తెలిపారు. ఇలా గతంలో చాలా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ఈటల తెలిపారు.

తాను నిబద్ధతతో పనిచేస్తూ గడ్డి పొచను కూడా గౌరవించే వ్యక్తిత్వం గలవాడినని తెలిపారు.  17 ఏళ్లలో కనీసం ఎర్ర చీమకు కూడా అన్యాయం చెయ్యలేదన్నారు. ఇతర పార్టీల వాళ్లకు కూడా పెన్షన్లు,సబ్సిడీ ట్రాక్టర్లు అందించి సంకుచిత భావన లేకుండా పనిచేశానన్నారు.

రోడ్లు, చెక్ డ్యాములు కట్టిస్తానని రాజకీయాల్లోకి  రాలేదనీ... మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల బాధలను తరిమికొట్టడానికి వచ్చానన్నారు. 2004 లో మొదటిసారి మీ వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించి గొప్పగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని ఈటల రాజేంధర్ స్పష్టం చేశారు.

click me!