నల్గొండ, పాలమూరు జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే కేసీఆర్ దే బాధ్యత: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 28, 2022, 5:05 PM IST
Highlights

ఎస్ ఎల్ బీసీ కి కేటాయించిన  45 టీఎంసీల నీటి కేటాయింపును రద్దు చేస్తూ జారీ చేసిన 246 జీవోను రద్దు చేయాలని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ నీటిని కేటాయింపును వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడాన్నిఆయన తప్పుబట్టారు. 

నల్గొండ: నల్గొండ రైతులకు నష్టం కల్గించే 246 జీవోను రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య రక్తపాతం  జరిగితే కేసీఆరే బాధ్యత వహించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ జీవోను రద్దు చేయకపోతే దీక్షకు  దిగుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ  అవసరమైతే సీఎం ను కలుస్తానని కూడా ఆయన చెప్పారు. ఈ జీవోను రద్దు చేయకపోతే  దీక్షకు దిగుతానని కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

ఎఎస్ఎల్‌బీసీకి  కేటాయించిన  నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు.  ఎస్ఎల్ బీసీకి 45 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్ ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిని   పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఇచ్చిన జీవో 246ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ జీవోను రద్దు చేయాలనే డిమాండ్ తో అవసరమైతే నల్గొండలో దీక్ష చేస్తామన్నారు. ఈ విషయమై నీటిపారుదల ఇంజనీర్లతో కూడా తాను చర్చించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  కేసీఆర్ పాలనలో  దక్షిణ తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.  ఈ సమయంలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య చిచ్చుకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.  గతంలో ఎస్ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీలను యధావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎల్ బీసీ నల్గొండ జిల్లాకు సాగు తాగు నీరు అందించే ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు.

ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోన దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఉద్దేశించిందని ఆయన గుర్తు చేశారు. అయితే 45 టీఎంసీల నీటిని  రద్దు చేయడంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు.

 

click me!