అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 27, 2021, 05:43 PM ISTUpdated : Jun 27, 2021, 06:17 PM IST
అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు.

కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు.

సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందని అనుకున్నానన్నారు కోమటిరెడ్డి. తాను కార్యకర్త నుంచి వచ్చిన వాణ్ణి అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలకు న్యాయం జరగదని కేడర్‌కి చెప్పినట్లయ్యిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత కిచ్చన్నరెడ్డి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒక పక్కన రేవంత్ వర్గం సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు అసంతృప్త నేతలు రాజీనామా బాట పడుతూ వున్నారు.

Also Read:అసంతృప్తులతో మాట్లాడుతున్నాం:షబ్బీర్ అలీ

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులుగా ఉన్న సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది హైకమాండ్. వారిని ఎలాగైనా బుజ్జగించాలని భావిస్తోంది. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు ఢిల్లీ పెద్దలు. కోమటిరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం చివరి వరకు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి పోటీ పడ్డారు. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు రావడంపై అసంతృప్తులు పెల్లుబుకుతాయని హైకమాండ్ భావిస్తోంది. అసంతృప్తులు ఎవరూ పార్టీని వీడకుండా..ఉండేందుకు నష్టనివారణ చర్యలు చేపడుతోంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ