భువనగిరి పరువు హత్య కేసు: భార్గవికి సుపారీ కిల్లర్ లతీఫ్ బెదిరింపులు.. వెలుగులోకి మరిన్ని వాస్తవాలు

Siva Kodati |  
Published : Apr 17, 2022, 08:33 PM ISTUpdated : Apr 17, 2022, 08:35 PM IST
భువనగిరి పరువు హత్య కేసు: భార్గవికి సుపారీ కిల్లర్ లతీఫ్ బెదిరింపులు.. వెలుగులోకి మరిన్ని వాస్తవాలు

సారాంశం

భువనగిరి పరువు హత్య కేసులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రామకృష్ణను హత్య చేసిన సుపారీ కిల్లర్ లతీఫ్.. మృతుడి భార్య భార్గవిని కూడా బెదిరించాడు. 

భువనగిరి పరువు హత్య కేసులో (bhongir honor killing) కీలక పరిణామం వెలుగుచూసింది. రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి రామకృష్ణను (rama krishna) హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్. పరువు కోసం అల్లుడిని చంపించాడు వెంకటేశ్. పథకం ప్రకారం భూమి కావాలంటూ రామకృష్ణను ట్రాప్ చేశారు. ముందుగా భూమి కావాలంటూ జిమ్మాపూర్ సర్పంచ్ భర్త యాకయ్య... వెంకటేశ్‌తో మాట్లాడాడు. తర్వాత రామకృష్ణకు లతీఫ్‌ను పరిచయం చేశాడు యాకయ్య. ఈ క్రమంలో రామకృష్ణను లతీఫ్ గ్యాంగ్ హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసింది. తర్వాత హత్య చేసి పాతిపెట్టేశారు.  ఈ కేసులో భార్గవి తండ్రి వెంకటేశ్ సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

రామకృష్ణను హత్య చేసిన లతీఫ్ గ్యాంగ్ అతని భార్య భార్గవిని బెదిరించింది. రియల్ ఎస్టేట్  ప్రాపర్టీ చూపించాల్సిందిగా రామకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు లతీఫ్. పైగా నమ్మకం కలిగించేందుకు రామకృష్ణ ఖాతాకు డబ్బు కూడా పంపించాడు. ఈ విషయం భార్గవికి కూడా తెలుసు. దీంతో లతీఫ్‌కు ఫోన్ చేసి తన భర్త ఆచూకీ గురించి అడిగింది. అయితే భార్గవిని కూడా బెదిరించాడు లతీఫ్.

రామకృష్ణ 2020 ఆగష్టు 16న ప్రేమ వివాహం చేసుకొన్నాడు. స్వంత గ్రామం లింగరాజుపల్లెలోనే భార్యతో రామకృష్ణ నివాసం ఉన్నాడు. అయితే భార్గవి గర్భవతి కావడంతో తరచూ ఆసుపత్రికి వెళ్లడానికి వీలుగా తన నివాసాన్ని భువనగిరికి మార్చాడు. ఇటీవలనే భార్గవి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  తుర్కపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ కు గురయ్యారు. దీంతో రామకృష్ణ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.  అయితే రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను లతీఫ్ అనే రౌడీషీటర్ భూమిని చూపించాలని పిలిపించి హత్య చేశారని  మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.  రామకృష్ణ మామ  వెంకటేష్ సూచనలతో లతీఫ్ అతని గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. 

నెల రోజులుగా రామకృష్ణపై లతీఫ్ నిఘా

రామకృష్ణపై లతీఫ్  నెల రోజులుగా నిఘాను ఏర్పాటు చేశారు.  ప్లాట్ కొనుగోలు చేస్తానని లతీఫ్  రామకృష్ణను నమ్మించాడు. ఈ విషయమై కొంత నగదును కూడా రామకృష్ణకు లతీఫ్ పంపాడు.  దీంతో ఫ్లాట్ చూపిస్తానని రామకృష్ణ చెప్పారు. రామకృష్ణను హైద్రాబాద్ పిలిపించి కిడ్నాప్ చేసి రామకృష్ణను లతీఫ్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?