ఇబ్రహీంపట్నం వెళ్లే తీరిక లేదు కానీ.. ఫ్లైట్‌లో బీహార్ వెళ్లి రాజకీయాలా : కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

Siva Kodati |  
Published : Aug 31, 2022, 08:53 PM IST
ఇబ్రహీంపట్నం వెళ్లే తీరిక లేదు కానీ.. ఫ్లైట్‌లో బీహార్ వెళ్లి రాజకీయాలా : కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.   

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాల ముఖ్యమా అంటూ కోమటిరెడ్డి ఫైరయ్యారు. ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు మరణిస్తే.. మీకు వారిని పరామర్శించే తీరిక లేదా అంటూ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విమానంలో బీహార్‌కు వెళ్లి రాజకీయాలు మాట్లాడే సమయం వుందా అంటూ కేసీఆర్‌పై ఆయన ఫైరయ్యారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో ఒక గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని అన్నారు. వాళ్లంతా నిరుపేదలేనని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని రేవంత్ ఆరోపించారు. అల్లుడు హరీశ్ సమర్ధుడని కేసీఆర్ ఆరోగ్య మంత్రిని చేశారని.. కానీ ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. 

ALso REad:ఇక్కడ జనం చస్తుంటే.. కేసీఆర్‌కు బీహార్‌లో పర్యటనలేంటీ : ఇబ్రహీంపట్నం ఘటనపై రేవంత్ ఫైర్

మరోవైపు.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి ప్రాక్టీస్ లైసెన్స్ ను రద్దు చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు  హైద్రాబాద్ నిమ్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళలను మంత్రి హరీష్ రావు బుధవారం నాడు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన చెప్పారు. 30 మంది మహిళలకు చికిత్స అందించడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గిందన్నారు. ఒక్కరూ కూడా ఐసీయూలో లేరన్నారు. ఇవాళ కొందరిని, రేపు, ఎల్లుండి మిగిలినవారిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ను కూడా సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరకరమన్నారు.  ఈ ఘటనలో ఇంకా  ఎవరి పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన ప్రకటించారు.

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?