కరోనా వార్...వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి కేసీఆర్...: భట్టి విక్రమార్క

By Arun Kumar PFirst Published Mar 14, 2020, 4:42 PM IST
Highlights

తెలంగాణలోో కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించడాన్ని ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్ర కెసీఆర్ కరోనా వైరస్ రాష్ట్రంలోని రానివ్వబోమని అంటున్నారు తప్ప అందుకోసం తీసుకుంటున్న ముందస్తు చర్యలేమిటో చెప్పడం లేనది మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేవలం ఆయనను చూసే కరోనా వైరస్ వణికిపోయి రాష్ట్రంలో అడుగుపెట్టడు అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలా వణికితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్లి ఆయనను ప్రపంచమంతా తిప్పి ప్రజలందనికి కాపాడాలని కోరతామంటూ సెటైర్లు విసిరారు.  

కరోనాను చూసి అమెరికా, యూరప్ వంటి అభివృద్ది చెందిన దేశాలే భయపడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రం మరింత జాగ్రత్తగా లేకపోతే ప్రమాద తీవ్రత అధికంగా వుంటుందని మాత్రమే తాము ప్రభుత్వానికి సలహా ఇచ్చామన్నారు. తమ సూచనలను స్వీకరించకుండా సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని... కాంగ్రెస్ పార్టీని కరోనా వైరస్ పోల్చారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

read more  యథావిధిగా పరీక్షలు: తెలంగాణలో బడులు, థియేటర్లు, మాల్స్ బంద్

రాష్ట్ర ప్రజలను అప్రమత్తంగా వుండాలని చెప్పాల్సిన బాధ్యతాయుతమైన సీఎం పదవిలో వున్న వ్యక్తి అసెంబ్లీలోనే భూత వైద్యుడిలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపేసి నిజాలు చెప్పాలన్నారు. కరోనా వ్యాపించకుండా హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో వెల్లడించాలని భట్టి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు. 


 

click me!